![]() |
![]() |

జీ తెలుగులో "సంక్రాంతి అల్లుళ్ళు పండగకి వస్తున్నారు" పేరుతో సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాం టెలికాస్ట్ కాబోతోంది. ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఇచ్చారు. ఇక వరుణవి అటు ప్రదీప్ ని ఇటు సుధీర్ ని పంచ్ డైలాగ్స్ తో ఆడేసుకుంది. "నీకు నేను తెలుసా ప్రదీప్ ని" అన్నాడు. " ఒక పక్కన పెన్షన్ తీసుకుంటూ ఇంకో పక్క పెళ్లి కాలేదు అని టెన్షన్ పడుతున్న యాంకర్ నువ్వే కదా" అనేసింది. ఇక సుధీర్ స్పందిస్తూ "ప్రదీప్ అన్న చాలా మంచోడు అన్న మీద పంచులు వేయకూడదు" అంటూ చెప్పాడు.
"అతనొక గొప్ప సిద్ధాంతి నువ్వొక పెద్ద వేదాంతి" అంటూ ఇద్దరినీ కలిపి అనేసింది. "అందరినీ ఎంటర్టైన్ చేద్దామని వచ్చాను కాబట్టే గొడవలొద్దు అనుకుంటున్నా" అన్నాడు సుధీర్. "ఒరేయ్ లగెత్తరోయ్" అంటూ చెప్పిన డైలాగ్ కి హీరో రవితేజ నవ్వేశారు. తర్వాత రవితేజ నటించిన ఖడ్గం మూవీలో సాంగ్ ని ప్యారెడీ చేసి "నన్ను కూడా ఆర్టిస్ట్ చెయ్యి లేకపోతే హీరోయిన్ చెయ్యి" అంటూ పాట పాడి అందరినీ మెప్పింది. దాంతో రవితేజ లేచి స్టేజి మీదకు వచ్చి వరుణవిని ఎత్తుకున్నారు. "నీతో మాట్లాడుతుంటే నాకు కిక్కోస్తుంది" అంది "నాకు కిక్కోచ్చేసింది" అంటూ గట్టిగ చెప్పారు రవితేజ.
![]() |
![]() |